మేడ్చల్, ఏప్రిల్26(నమస్తే తెలంగాణ): నేడు వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్ర సృష్టిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. నేడు వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రాగామిగా నిలిచిందన్నారు. 16 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 20 యేండ్ల వెనక్కి వెళ్లిందన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, మళ్లి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని ప్రజలు చర్చించుకుంటున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కనివిని ఎరుగని రితిలో జరగనుందని బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
నేడు వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గులాబీ మయం గా మారింది. జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఛలో వరంగల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ల నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మంది తరిలేలా స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. వందలాది బస్సుల పాటు వేలాది కార్లు బీఆర్ఎస్ సభకు తరలివెళ్లేలా సిద్ధమయ్యారు. 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రజలు వరంగల్ సభకు వచ్చేందుకు స్వచ్ఛంద్థంగా ముందుకు వస్తున్నారు. దీంతో సభకు వారు వచ్చేలా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశారు.
రామంతాపూర్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆదివారం కుటుంబసమేతంగా రావాలని కోరుతూ చిలుకానగర్ డివిజన్లో శనివారం ఇం టింటికీ బొట్టు కార్యక్రమం చేపట్టారు. చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప్ప ల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు కుమ్మరి కుంటలో ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి కుటుంబ సమేతంగా రజతోత్సవ సభకు రావాలని ప్రజలను ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా మేమందరం కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున బయలుదేరి వస్తామని ప్రజలు మాట ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే,కార్పొరేటర్, కాలనీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కాప్రా: బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజ లు సిద్ధం కావడం హర్షణీయమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కాప్రా డివిజన్ గాంధీనగర్‌లో వికలాంగుడు బతిక రాఘవేంద్ర వరంగల్ సభకు తన త్రిచక్ర వాహనంతో సిద్ధం కాగా ఆయన వాహనానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ జెండా ఊపి ప్రారంభించారు. ఇదే డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం కల్వర్టు దగ్గర భారీగా ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగుడైన బతిక రా ఘవేంద్రను అభినందించా రు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ మైనార్టీ ఇన్ చార్జి బద్రుద్దీన్ బీఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్, మహేష్, కొండల్ గౌడ్, ఇంద్రయ్య, భాస్కర్ గౌడ్,చందు, శివకుమార్ పాల్గొన్నారు
జవహర్‌నగర్: బీఆర్ఎస్ జెండాతెలంగాణ ప్రజల మదినిండగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అనతికాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని ఉద్యమ కారుల ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్‌రెడ్డి దు య్యబట్టారు. వరంగల్ ఎల్కతుర్తి నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉద్యమకారులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని కోరు తూ జవహర్‌నగర్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
పోచారం: బీఆర్ఎస్ రజతోత్సవ సభను పోచారం మున్సిపాలిటీ ప్రజలు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణలు అనంతరం సభకు తరలి వెళ్ళాలని ఆయన కోరారు.
ఉప్పల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను చిల్కానగర్‌లో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ శనివరం ఆవిష్కరించారు. రజతోత్సవ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండల్ రెడ్డి, శ్రీనివాస్ శ్యామ్ పాల్గొన్నారు.
కీసర: రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు దండులా కదలాలని మండ ల బీఆర్ఎస్ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి సూచించారు. కీసరలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బోడుప్పల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజ యవంతం చేయాలని బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్య క్షుడు మంద సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, రవి గౌడ్, నగేష్, శ్రీధర్, యాదగిరి పాల్గొన్నారు
మల్లాపూర్:బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా హెచ్‌బీ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ మైదానంలో బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కరిపే ప్రవీణ్ వంజరి ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ రంగు కుర్తాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ ప్రభు దాస్ మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్ రెడ్డిలతో 100 మంది కార్యకర్తలకు కుర్తాలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాగే శ్వరరా వు, బీఆర్ఎస్ నాయకులు జంపాల్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్: బీఆర్ఎస్ రజతోత్సవం సభకు నాయ కులు,కార్యకర్తలు తరలివెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించటం చేతకాని తనాని కి నిదర్శనమని మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి విమర్శించారు. ఘట్ కేసర్ పట్టణంలో శనివారం విలేకరులతో వారు మాట్లాడారు. రజతోత్సవ సభకు మున్సిపల్ నుంచి భారీగా తరలివెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
చర్లపల్లి: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి, ఉద్యమ నాయ కుడు కనకరాజుగౌడ్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నా యకులు పాల్గొన్నారు.
మేడ్చల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్‌ను శనివారం మాజీ మంత్రి మల్లారెడ్డి బోయినిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మేడ్చ ల్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ కనీ, వినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబురం జరుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌పోర్టు ఫోర్స్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్, నేతలు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ పట్టణం నుంచి 200 కార్ల ర్యాలీతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలనున్నట్టు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ మున్సిపాల్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ తెలిపారు. ఉమ్మడి మండలానికి చెందిన నాయకులు మేడ్చల్‌లోని వివేకానంద విగ్రహం ర్యాలీగా బయల్దేరి వెళ్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి మేడ్చల్ మండలంలోని అన్ని గ్రామాలు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలి టీల్లోని వార్డుల్లో పార్టీ జెండాలను ఉదయం 9 గంటలకు ఆవిష్కరించిన అనంతరం మేడ్చల్‌కు చేరకుం టారని తెలిపారు. ఉదయం 10 గంటలకు మేడ్చల్ నుంచి బయల్దేరి వెళ్తామని తెలిపారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు సిద్దిపేటలో భోజనం చేసిన మధ్యాహ్నం 3 గంటల వరకు సభాస్థలికి చేరుకుంటామని తెలిపారు.