ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్‌కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్టింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా మారని పేదల జీవితాలకు ‘బీఆర్ఎస్’ సరికొత్త భరోసానిచ్చింది. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్-లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. మండుటెండను సైతం లెక్కచేయక.. వృద్ధులు, మహిళలు, యువకులు, పిల్లలు తండోపతండాలుగా తరలివచ్చారు.
దేశ్ కీ నేత.. కేసీఆర్ కీ జై అంటూ నినదించారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. గత పాలకులు దేశంలో అనుసరించిన విధానాలను తనదైన శైలిలో ఎండగట్టారు. మహారాష్ట్ర అన్నదాతలు బాగుపడేదాకా వస్తూనే ఉంటానని.. బీఆర్ఎస్ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సభకు వచ్చిన ప్రజలు, రైతులకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన వారికి స్వాగతం పలికారు.
Hyd13
Hyd12