BRS Party | అంబర్‌పేట, ఫిబ్రవరి 22 : నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె.శ్యామ్(గోల్నాక శ్యామ్) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. శ్యామ్ మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు శిష్యుడైన శ్యామ్ కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రయాశీల కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన శ్యామ్ డివిజన్ స్థాయిలో పలు పదవులను నిర్వహించారు.
గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్యామ్ శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుది శ్యాస విడిశారు. శ్యామ్ వయసు 59 సంవత్సరాలు, ఆయనకు భార్య భాగ్య, కూతురు సరళ, కుమారుడు దుర్గాప్రసాద్ సంతానం.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, కోటం అనిల్‌కుమార్, రావుల సుధాకర్, బీజేపీ నాయకులు కేజే బాబు, ఆనంద్‌కుమార్, సీనియర్ పాత్రికేయులు ఎం.సతీష్‌ముదిరాజ్, వర్కాల కృష్ణ, తదితరులు దివంగత శ్యామ్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హర్రాస్ పెంట హిందూ స్మశాన వాటికలో శ్యామ్ అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.