ఘట్కేసర్/ పీర్జాదిగూడ/ ఘట్కేసర్/ శామీర్‌పేట, అక్టోబర్ 3: నాయకులు ఏ పార్టీలోకి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కడుతారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలా జీనగర్, అంబేద్కర్ చౌరస్తాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను చైర్పర్సన్ ముల్లి పావనీజంగ య్య యాదవ్, పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘట్కేసర్ మున్సిపాలిటీ ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని అన్నారు. నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లినంత మాత్రాన ప్రజలు పట్టించుకోరని, అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కొందరు ఇతర పార్టీలకు వెళ్లి పనిగట్టుకొని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకుకనీస సౌకర్యాలైన తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, విద్య, వైద్యం, డ్రైనేజీ, పచ్చదనం, పార్కులు, వైకుంఠధామాల వంటి అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీని మంత్రి కేటీఆర్ సహకా రంతో మంత్రి మల్లారెడ్డి ఎంతో ఆభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవతోనే ఘట్కేసర్ వంతెన నిర్మాణ పనులు జోరందుకున్నాయని అన్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని వివరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు, కోఆష్షన్ సభ్యులు, మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు పడిగెం వెంకటేశ్వరావు, సుధాకర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ఎస్ .శ్రీనివాస్ గౌడ్, రేసు లక్ష్మారెడ్డి, నరేశ్ గౌడ్, హరిశంకర్ ముదిరాజ్, సిరాజ్, యాదగిరి, మహిళా నాయకులు పద్మ, రమ, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
బీఆర్ఎస్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డిని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 13వ డివిజన్ పీఅండ్‌టీ కాలనీలో మేయర్, స్థానిక కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మీ శ్రీధర్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను ఓటర్లకు అందజేసి మంత్రి మల్లారెడ్డికి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు పాండు, శ్రీనివాస్‌రెడ్డి, మహిళలు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పోచారంలో..
పోచారం మున్సిపాలిటీ 1,2 వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మున్సి పల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మందాడి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పత్రాలను అందజేశారు. పోచా రం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో జల మండలి ఆధ్వర్యంలో స్థానికంగా భారీ నీటి ట్యాంక్‌లను నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరాను చేస్తున్నట్లు వివరించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఆసరా పింఛన్లతో ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, నాయకులు జి. బాలేశ్, శేఖర్ ముదిరాజ్, కౌన్సిలర్లు ఎన్.ధనలక్ష్మి, బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జి.మాధవి, స్వామి, కాశయ్య, నర్సింహ, ఎం.శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.
గ్రామాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభం
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట, లాల్‌గడి మలక్‌పేట గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాలను ఆయన ప్రారంభించి మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్, ఉద్దెమర్రి తదితర గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుదర్శన్, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, సర్పంచ్‌లు బాలమణి, వనజాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ ఇందిరారాజిరెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్ భూమిరెడ్డి,పార్టీ గ్రామ అధ్యక్షుడు మేడి రవి, బి.రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.