MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | కేసీఆర్ ప్రతిపాదించిన 25 వేల కోట్ల ప్రాజెక్టు ఎక్కడ..? రేవంత్ లక్షా 50 వేల కోట్లు ఎక్కడ..? మూసీ బ్యూటీఫికేషన్ పేరిట లూటిఫికేషన్ కు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు.
MLA Sudheer Reddy | మూసీ ప్రాజెక్టుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి ప్రజల మాట వినకుండా నిరంకుశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ నష్టం జరగకుండా కేసీఆర్ ముందు చూపుతో నాడే మూసీ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ.. ప్రభుత్వమే పొంతన లేకుండా మాట్లాడుతోంది. దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. 50 మీటర్ల బఫర్ జోన్‌ను 500 మీటర్లకు ఎలా పెంచారు..? డీపీఆర్ లేకుండా ఎలా టెండర్లు పిలుస్తారు..? అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.
కమీషన్లు తీసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేయవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.. ప్రభుత్వం డీపీఆర్ బయటపెట్టి.. ప్రజలకు అన్ని వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది.. ఎవరి గూడు చెదరనివ్వబోము. అధికారం ఉందని బలవంతంగా చేస్తామని అంటే ఊరుకునేది లేదు. ప్రజల తరపున మాట్లాడేందుకు వెళ్లిన మమ్మల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేయడం మానుకోవాలి. కేసీఆర్ కట్టిన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తామని అంటారు… కానీ, కన్నేపల్లి నుంచి మాత్రం నీటిని ఎత్తిపోయరు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… ఏమైనా కానీ నీళ్లు ఎత్తేది లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదన్నారు.
రేవంత్ స్వలాభం కోసం ప్రాజెక్టుకు రూపకల్పన..
కేసీఆర్ హయాంలో రూ.25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళిక వేస్తున్నామని.. అప్పుడు పేదల ఇళ్ల నుంచి ఒక్క ఇటుక కూడా తీయలేదని.. 10 వేల గృహాలు బఫర్ జోన్లో ఉన్నాయి. కనుక కేసీఆర్ కూల్చివేతలకు ఒప్పుకోలేదు.. ఆప్షన్ బీ అమలు చేద్దామనుకున్నాం ..ఎలేవేటేడ్ కారిడార్ అనుకున్నాం ..ఎన్నికల కోడ్ వచ్చింది..ప్రభుత్వం మారింది ..ఇపుడు రియల్ ఎస్టేట్ కోణంలో స్వలాభం కోసం రేవంత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ..రేవంత్ చెప్పిన ప్రకారమే 50 వేల కోట్ల నుంచి లక్షా 50 వేల కోట్లకు పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన 25 వేల కోట్ల ప్రాజెక్టు ఎక్కడ..? రేవంత్ లక్షా 50 వేల కోట్లు ఎక్కడ..? మూసీ బ్యూటీఫికేషన్ పేరిట లూటిఫికేషన్ కు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శించారు.
మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు..
మూసీ పేరుతో రేవంత్ చేస్తున్న ₹1.5 లక్షల కోట్ల దోపిడీపై బీఆర్ఎస్ వ్యతిరేకం!డీపీఆర్ లేకుండా టెండర్లు ఎందుకు పిలిచారు?
ముందు కమీషన్లు.. తర్వాత పనులు!
పనులు కాకపోతే బీఆర్ఎస్పై నిందలు వేయడమే కాంగ్రెస్ కుట్ర!మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్ధి లేదు..
కమీషన్ల మీదే కాంగ్రెస్‌కు శ్రద్ధ!– ఎమ్మెల్యే @D_SudheerReddy 🔥
— BRS Party (@BRSparty) October 28, 2026
Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

