జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ఆదివారం మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంతో పాటు పాదయాత్రలు చేపట్టారు. కాంగ్రెస్ అసమర్థ పాలనను వివరించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుంచారు. కారు గుర్తుకు ఓటువేసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. – జూబ్లీహిల్స్ జోన్, అక్టోబర్ 19