Padma Rao Goud | హైదరాబాద్ : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మోండా మార్కెట్లోని ఇస్లామీయ హైస్కూల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని వినియోగించుకోవడం మన బాధ్యత. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 24.91 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.