MLC Kavitha | హైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కవిత పేర్కొన్నారు.