MLA Talasani | అమీర్పేట్, ఫిబ్రవరి 15 : మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు అనుసరణీయమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బాపునగర్లో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాపునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు హరి సింగ్ యాదవ్ ఎమ్మెల్యే తలసానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. బంజారాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్ తో పాటు టిఆర్ఎస్ నాయకులు గోపిలాల్ చోహన్, అశోక్ యాదవ్, కూతురు నరసింహ, కట్టా బలరాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.