MLA Sudheer Reddy | ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గాభవాని నగర్ కాలనీకి చెందిన బాధితురాలు విజయ గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ.. వైద్య నిమిత్తం ఓ హాస్పిటల్లో చేరింది. ఈ నేపథ్యంలో ఆ పేద కుటుంబం హాస్పిటల్ ఖర్చులు భరించలేక ముఖ్యమంత్రి సహాయ నిధి అర్జీ కోసం గత కొద్ది రోజుల క్రితం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించి వారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకున్నారు. ఇందుకుగాను విజయ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2,00,000 లు మంజూరు అయ్యాయి. బాధితురాలికి మంజూరైన ఆ మొత్తం చెక్కును మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని అన్నారు.