MLA Sabitha | ఆర్కే పురం, జూన్ 22 : మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ పట్టణంలో శ్రీ బొడ్రాయి దేవత మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై బొడ్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కూడిన ఈ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, లోకసాని కొండల్ రెడ్డి, సరూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కి సంబంధిన ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.