MLA Padma Rao Goud | అన్ని సంక్షేమ కార్యక్రమలు కొనసాగించాలి : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
MLA Padma Rao Goud | సికింద్రాబాద్, మే 17 : గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మారేడ్పల్లి, ముషీరాబాద్ మండలాలకు చెందిన 255 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను సీతాఫల్ మండి చౌరస్తాలో పద్మారావు గౌడ్ శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించి చేసిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ప్రభుత్వం వద్ద నిధులు లేవని పదే పదే పేర్కొనడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో నిరంతరం తాము ప్రజలకు అండగా నిలుస్తున్నామని, సీతాఫల్ మండిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే పద్దతిని పద్దతిని పాటిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామని, ఏ అవసరానికైనా ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.
మారేడుపల్లి మండలానికి చెందిన 159 మందికి, ముషీరాబాద్కు చెందిన 96 మందికి రూ.2.55 కోట్ల మేరకు విలువజేసే చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మారేడుపల్లి ఎమ్మార్వో భీమయ్య గౌడ్, ముషీరాబాద్ ఎమ్మార్వో ప్రతాప్ సింగ్, వెంకట లక్ష్మీ, కార్పొరేటర్లు హేమ, శైలజ, ప్రసన్న లక్ష్మీ , సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

