MLA Muta Gopal | ముషీరాబాద్, మార్చి 4 : బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ముషీరాబాద్ డివిజన్ జెమినీ కాలనీలో ఎన్నికల సమయంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జెమినీ కాలనీ, దాయర మార్కెట్, మణెమ్మ గల్లీలో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జెమినీ కాలనీ వాసులు కలుషిత నీటి సరఫరా జరుగుతుందని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వీధి దీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దాయార మార్కెట్లో తవ్విన రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, దుమ్ముధూళి సమస్య అధికమైందని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే దయార మార్కెట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. జెమినీ కాలనీలో కలుషిత నీటి సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడానికి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈలు సన్నీ, గీత, జలమండలి డీజీఎం మోహన్. రాజ్, మేనేజర్ శివ, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, శ్రీధర్ రెడ్డి ,శంకర్ ముదిరాజ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, దీన్ దయాల్ రెడ్డి, అరుణ్ కుమార్, డేవిడ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, మమ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, సురేందర్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.