Muta Gopal | చిక్కడపల్లి, జూలై 8 : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని దేవాలయాల అభివృద్ధికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్లోని సిద్ధంశెట్టి అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న బంగారం పోచమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి ఎంతో సహకారం అందించిన ఎమ్మెల్యే ముఠాగోపాల్ను అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు హాజరుకావాలని ఆహ్వానించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జితేందర్, సంయుక్త కార్యదర్శి ప్రసన్న, పద్మ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.