MLA Muta Gopal | చిక్కడపల్లి, ఫిబ్రవరి 18 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదరణ పొందాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం బాగ్ లింగoపల్లిలోని హిమాయత్ నగర్ తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, తహసిల్దార్ సంధ్యారాణితో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ.. పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల వివాహాలు భారంగా కావద్దని కేసీఆర్ ఈ పథకం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, డిప్యూటీ తాసిల్దార్ రఘు విష్ణు, బిఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర ముదిరాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కవాడిగూడ డివిజన్ కార్యదర్శి సాయి కృష్ణ, నాయకులు కళ్యాణ్ నాయక్, నితిన్, రాజశేఖర్ గౌడ్, ఎస్టీ ప్రేమ్, దేవేందర్ నాయక్, సుధాకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.