MLA Muta Gopal | కవాడిగూడ, ఏప్రిల్ 5 : దళితుల హక్కులను కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన అందించిన గొప్ప పరిపాలనాదక్షుడు భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎన్.డి.సాయికృష్ణ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. నైతిక విలువలు కలిగిన నాయుడిగా ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. వారి స్ఫూర్తి ఆలోచనా విధానం ప్రతి ఒక్కరికీ మార్గదర్శనం కావాలని అన్నారు.
యువ నాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ.. కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు, స్వతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ అన్నారు. దేశంలో సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అఖండ భారతావనికి సేవలందించిన ఆ మహనీయుని ఆశయాలు నేటి యువతరానికి స్ఫూర్తి కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, నాయకులు రామ్‌చందర్, రాజశేకర్, ముచ్చకుర్తి ప్రభాకర్, చిత్రాలనగర్ శ్రీహరి, వల్లాల రవి, మధు, సంతోస్, హరీష్, శివలాల్, విఠల్, వేణు తదితరులు పాల్గొని బాజూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.