Hyderabad | అంబర్పేట, ఏప్రిల్ 5 : నల్లకుంట డివిజన్ మయూరి లేన్, స్ట్రీట్ నెంబర్ నాలుగులో రూ. 22 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించినట్లు తెలిపారు. గత ఆరు సంవత్సరాలలో నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్ అంబర్పేట తదితర డివిజన్లలో గల బస్తీలు, కాలనీలలో అవసరమైన అన్ని ప్రాంతాలలో నూతన డ్రైనేజీ వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే మంచినీటి పైప్ లైన్ వ్యవస్థను కూడా ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. నూతన రోడ్లు నిర్మించడమే కాకుండా పార్కులు సుందరీకరించడం, వాన నీటి పైప్ లైన్లను కూడా మార్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మయూరి సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు బి. ప్రమోద్ కుమార్, పి. పరిమల్ రావు, ఎస్. రామ్ జగదీష్, ఆర్. రామ్మోహన్, ఎస్. రాఘవేంద్ర, ఎస్. శ్రీకాంత్, ఆర్. రామ్మోహన్, జేపీ వరదరాజు, స్థానిక బిజెపి నాయకులు మధుసూదన్ యాదవ్, ప్రశాంత్ జోషి, కే లక్ష్మణ్, కేజే బాబు, కిషోర్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.