నగరంలో గులాబీ గుబాళించింది. నామినేషన్ల దాఖలుకు నిర్వహించిన ర్యాలీలే విజయోత్సవ సభలను తలపించాయి. సర్వమత ప్రార్థనలు చేసి.. తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలికారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆట పాటలు, పటాకుల పేలుళ్లు, భారీ బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. పాదయాత్రలు, ర్యాలీగా సాగుతూ భారీ జనసంద్రం నడుమ బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సనత్‌నగర్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద, కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఉప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు లాస్యనందిత, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ర్యాలీలతోనే గులాబీ అభ్యర్థుల విజయం ఖరారైందని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
– సిటీబ్యూరో, నవంబరు 9 (నమస్తే తెలంగాణ )
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నామినేషన్ల దాఖలులో గులాబీ గుబాళించింది. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆట పాటలు… భారీ బైక్ ర్యాలీలతో బీఆర్ఎస్ అభ్యర్థులు సందడి చేశారు. పాదయాత్రలు, ర్యాలీలుగా కదిలి.. జనసంద్రం నడుమ అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు వేశారు. సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మొదట తల్లి అశీర్వాదం తీసుకొని.. ఆ తర్వాత బైబిల్‌హౌస్ వద్ద నుంచి వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో సిటీ లైట్ హోటల్, బాటా, ప్యాట్నీ, హరిహరకళా భవన్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా శాలువాలు, పూలమాలలతో వివిధ కాలనీలు, సంఘాలు, బస్తీ ప్రతినిధులు మంత్రి తలసానికి స్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీ సాగింది. అనంతరం సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి తలసాని తన నామినేషన్ పత్రాలను అందజేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్దమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇన్చార్జి కట్టెల శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని షేక్‌పేట మండల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి మాగంటి గోపీనాథ్ తన నామినేషన్ పత్రాలు అందజేశారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లి మసీదులో మత పెద్దల ఆశీర్వాదం తీసుకుని… ప్రార్థనలు చేశారు. అనంతరం మాధవరం కృష్ణారావు తన తల్లి ఆశీర్వాదం తీసుకుని… బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి కూకట్పల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్యాంప్రకాశ్కు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాటేదాన్ బంగారు మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేశారు. అలాగే కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత, కుత్బుల్లాపూర్ అభ్యర్థి వివేకానంద, మల్కాజ్గిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ ర్యాలీగా బయలుదేరి..తమ నామినేషన్ ప్రతాలను దాఖలు చేశారు.
కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 9 : కూకట్పల్లి బీఆర్ఎస్, ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు గురువారం కూకట్పల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.శ్యాంప్రకాశ్కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కూకట్పల్లి మసీద్‌లో మత పెద్దల ఆశీర్వాదం తీసుకుని… ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాధవరం కృష్ణారావు తన తల్లి ఆశీర్వాదం తీసుకుని… బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే వెంట కో-ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్‌గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఎల్బీనగర్, నవంబర్ 9: ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తొలుత తన తల్లి చంద్రకళ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డిసాయిబాబా దేవాలయంలో, చైతన్యపురి ఫణిగిరి కాలనీలోని శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో, కర్మన్‌ఘాట్‌లోని శ్రీ ధ్యానాంజనేయస్వామి దేవాలయాల్లో పూజలు చేశారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలోని ఎల్బీనగర్ అసెంబ్లీ రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, బీఆర్ఎస్ నేత ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, రమేశ్‌లతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పంకజకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ విజయం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.
కవాడిగూడ, అక్టోబర్ 29: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ముషీరాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అశీర్వదించి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. గురువారం ఆయన లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణకు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని, సీఎం కేసీఆర్ అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నారని చెప్పారు.
అంబర్‌పేట, నవంబర్ 9: అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కాచిగూడ, లింగంపల్లిలోని రాఘవేంద్రస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి అంబర్‌పేట మండల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అపర్ణకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మావెంకటరెడ్డి, దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి గండ్ర మోహన్‌రావు, నియోజకవర్గం సమన్వయకర్త పద్మావతిడీపీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైదాబాద్, నవంబర్ 9: యాకత్‌పుర బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి గురువారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. సైదాబాద్ మండల కార్యాలయంలోని యాకత్‌పుర ఎన్నికల ఆర్వో వెంకటాచారికి తన నామినేషన్ పత్రాలను ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఐఎస్ సదన్, కుర్మగూడ, సంతోష్‌నగర్ డివిజన్ల అధ్యక్షులు మెట్టు భాస్కర్ రెడ్డి, దర్శనం నర్సింగ్‌రావు, చింతల శ్రీనివాస్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ గెలుపునకు శ్రీరామ రక్ష అని అన్నారు.