ఉప్పల్, అక్టోబర్ 27 : ఉప్పల్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్, చిలుకానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ మ్యానిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేపట్టారు. శాంతినగర్‌లో కాలనీవాసులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కరపత్రాలు పంచుతూ, వృద్ధులతో సంభాషిస్తూ, మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలను వివరించారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రజలకు సహాయ, సహకారాలు అందించడంలో నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. ప్రజల కోసం పనిచేసే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, ఆకుల మహేందర్, మేకల మధుసూదన్‌రెడ్డి, సుధాకర్, పిల్లి నాగరాజు, టంటం వీరేశ్, రాంరెడ్డి, అన్య బాలక్రిష్ణ, చంద్రశేఖర్, వెంకట్, నాయబు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
నాచారం డివిజన్లో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లతో మాట్లాడుతూ ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను తెలియజేస్తూ ప్రచారం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కారు గుర్తును మరువకుండా ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈమేరకు చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టి, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ, కారు గుర్తును మరిచిపోవద్దని సూచించారు.
చర్లపల్లి, ఆక్టోబర్ 27 : చర్లపల్లి డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తుందని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ, మారుతినగర్, గాంధీనగర్, చక్రీపురం తదితర ప్రాంతాలలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, కాసుల ఆనంద్రాజుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుగౌడ్, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, నర్సింహ వంశరాజ్, ధనుంజయ్యగౌడ్, కొమ్ము సురేశ్, మహిపాల్‌రెడ్డి, సుభాశ్, సోమయ్య, ముత్యాలు, పరుశురాం, లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో నాగార్జుననగర్ కాలనీలో బీఆర్ఎస్ బూత్‌స్థాయి కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
మల్లాపూర్, అక్టోబర్ 27 : ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాగలక్ష్మీనగర్, ఎస్వీనగర్ కాలనీలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఉప్పల్ శాంతినగర్, విజయపురికాలనీ, ఉప్పల్ మైదానం, వాకర్స్‌తో కలిసి ప్రచారం చేపట్టారు. ఉప్పల్‌లోని వాకర్స్‌తో కలిసి నడుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మీకు తోడుగా ఉంటానని తెలిపారు. అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, ఆకుల మహేందర్ పాల్గొన్నారు.
ఉప్పల్‌లోని మున్సిపల్ మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాయిపే ములాఖత్‌లో భాగంగా వారితో కలిసి ఆత్మీయ పలకరింపు, చర్చా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి సాధించాలంటే అది ఒక కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, పిట్టల నరేశ్ ముదిరాజ్, పిల్లి నాగరాజు, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి రామంతాపూర్‌లోని పలు కాలనీల ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌నగర్, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు, పాలకూర శ్రీకాంత్‌గౌడ్, శాగరవీంధర్, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తునికి సంధ్యారాణి, జహంగీర్, ఇల్లిటం నర్సింహారెడ్డి పాల్గొన్నారు.