Narsingi Water Crisis | మంచినీటి సమస్యపై బీఆర్ఎస్ పోరాటం.. నార్సింగిలో వాక్ ఫర్ వాటర్ పాదయాత్ర
Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు 'వాక్ ఫర్ వాటర్' పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు
Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను కాలనీ వాసులు వివరించారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు.
పాదయాత్ర అనంతరం బహిరంగ సమావేశంలో కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రజలకు నాలుగు రోజులు కూడా సక్రమంగా మంచినీరు ఇవ్వలేకపోతున్నాడని మండిపడ్డారు. మంచినీటి సరఫరాపై స్థానిక ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేకపోవడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయని అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నార్సింగిలో మహిళలతో కలిసి ‘వాక్ ఫర్ వాటర్’ పాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు @KarthikIndrAnna
నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యపై చేపట్టిన ‘వాక్ ఫర్ వాటర్’ పోరాటం శరవేగంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్… pic.twitter.com/cWHLsnZHHH— BRS Party (@BRSparty) May 17, 2026
నియోజకవర్గంలో సరిపడా నీటిని అందిస్తున్నామని అధికారులు చెప్పడం వివేక శూన్యమని విమర్శించారు. పాదయాత్ర పొడవునా కనిపిస్తున్న వాటర్ ట్యాంకర్లే ఇక్కడి నీటి ఎద్దడికి ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. మేము మంచినీటి సమస్యపై పోరాటం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆఘమేఘాలపై అధికారులతో చర్చలు జరిపారని అన్నారు. ఇప్పటివరకు ఆయనకు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

