బంజారాహిల్స్/ఖైరతాబాద్,డిసెంబర్ 12: తుంటి ఎముక సర్జరీ చేయించుకుని సోమాజిగూడలోని యశోద దవాఖానలో కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్కు సంఘీభావంగా మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గెట్వెల్ సూన్ కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలంటూ పలువురు కార్యకర్తలు కన్నీళ్లపర్యంతమయ్యారు.