amberpet | గోల్నాక, ఏప్రిల్ 21: అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై ప్రమాదకరంగా మారిన రంబుల్ స్ట్రిప్స్‌ను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులను కోరారు. చే నంబరు ఫ్లై ఓవర్ పై వరుసగా ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాహనదారుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన ఫ్లై ఓవర్ పై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా దూసరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రంబుల్ స్ట్రిప్స్ వల్ల వాహనదారులు అదుపు తప్పి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాలు జరుగుతున్నందున వెంటనే వాటిని తొలగించి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.