కొండాపూర్: అస్తవ్యస్తమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆదివారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ రాజేందర్ రెడ్డి నగర్ నుంచి శ్రీదేవి థియేటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రోడ్డు పనులను ప్రారంభించి.. ప్రజల ఇబ్బందులను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ చొరవ తీసుకుని పనులను ప్రారంభించేలా చూడాలంటూ ప్రజల తరపున కోరారు.