సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 8 (మంగళవారం)న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సభ విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఇతర ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొంటారని తలసాని వివరించారు.