వెంగళరావునగర్, అక్టోబర్ 26 : ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మాకెంతో మేలు చేశారు. మా కుటుంబానికి దళిత బంధు పథకం మంజూరైంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగాను. కానీ అక్కడ ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు. కేసీఆర్ సర్కార్ మాకు దళిత బంధు మంజూరు చేయడంతో కిరాణాషాపు పెట్టుకొని సంతోషంగా ఉన్నాం. రేవంత్‌రెడ్డి పాలన అంతా ఆగమాగంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదు. మాకింత ఉపకారం చేసిన కేసీఆర్‌ను ఎన్నటికీ మరువం. మేమంతా బీఆర్ఎస్కే ఓటేస్తాం’ అని వెంగళరావునగర్ డివిజన్.. రహ్మత్ నగర్ వీడియోగల్లీకి చెందిన శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ..కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో తెలిపారు. లబ్ధిదారులు ఆనంద్‌ను తమ ఇంటికి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీ తమకు చేసిన మేలు గురించి చెప్పుకుని కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్లో బస్తీవాసుల చేరిక
అలిజపూర్ కాలనీ లోదా బస్తీ వాసులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముఠాజైసింహ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్, చెరక మహేశ్, మోయిద్ తదితరులు పాల్గొన్నారు.
– షేక్‌పేట్,అక్టోబర్26
ఐటీ ఉద్యోగుల చేరిక..
కాప్రా, అక్టోబర్ 26: మన సిటీ ఐటీ ఉద్యోగులకు సేఫ్ అని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన అధునాతన ఐటీ పాలసీ ద్వారానే నగరం ఐటీ హబ్‌గా మారిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్‌కాలనీలో పలువురు ఐటీ ఉద్యోగులు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.