కాచిగూడ, మార్చి 30 : వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కాచిగూడ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ శిరీష యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సునీల్ బిడ్లాన్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డాక్టర్ శిరీష యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కంటే నీటి దానం గొప్పదని, ప్రజలు నీటిని పొదుపుగా వాడి ఇతరుల దాహార్తిని తీర్చాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత 36 ఏళ్లుగా కుద్విగూడలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సునీల్ బిట్లను డాక్టర్ శిరీష యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగేందర్ బాబ్జి, మహేష్ కుమార్, బబ్లు సింగ్, అంటో, ఎల్.రమేష్, పొట్లూరి సతీష్, శ్రీకాంత్ యాదవ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.