బంజారాహిల్స్,జూన్ 16: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలిరావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
వరదలా వస్తున్న బీఆర్ఎస్ నేతలతో భవన్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 9.30 ప్రాంతంలో నందినగర్ నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీనేతలు, కార్యకర్తలను కలిసి ఉదయం 10గంటలకు బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ అనంతరం కేటీఆర్ నందినగర్‌లో నివాసానికి చేరుకోగా అక్కడ ఆయనకు దిష్టితీసి లోపలికి స్వాగతం పలికారు.