Talasani Srinivas Yadav | బేగంపేట, ఏప్రిల్ 28: ఆర్థిక సమస్యలతో వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.7లక్షల మంజూరు పత్రాల ఎల్ఓసీని తలసాని అందజేశారు.
అమీర్‌పేట డిఇవిజన్కు చెందిన లత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన లత చికిత్స కోసం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తన చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన తలసాని.. సీఎం సహాయనిధి నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించి, ఆమెకు అందజేశారు. అలాగే సనత్ నగర్ డివిజన్‌కు చెందిన హేమలతకు వైద్య చికిత్స నిమిత్తం రూ.3లక్షలు, సాత్వికకు రూ.2లక్షల చొప్పున మంజూరు చేయించి ఎల్ఓసీలను లబ్ధిదారుల కుటుంబసభ్యులకు అందజేశారు.