మియాపూర్, జూలై 9 : విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రావు అన్నారు. విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తరగతులను వినాల్సిన దుస్థితి నెలకొన్న ఏమాత్రం స్పందన లేదని మండిపడ్డారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ వీకర్ సెక్షన్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రావు పార్టీ నేతలతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చుట్టుపక్కల వీధిలైట్లు లేకపోవడం వల్ల బయట నుంచి విష సర్పాలు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయని అన్నారు. ప్రతినిత్యం ఈ పరిస్థితి నెలకొంటున్నట్టుతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. తక్షణమే పాఠశాల ప్రహరి చుట్టూ వీధిలైట్లు ఏర్పాటు చేసి, వెనుక వైపు ఉన్న అపరిశుభ్ర పరిస్థితులను సరిదిద్దాలని ఆయన కోరారు.