12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు తన ప్రభను కోల్పోతున్నా యి. సరిపడా వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. అవసరమైన నిధులను విడు దల చేసి, వాటి అభ్యున్నతికి కృషి చేస్తే.. ప్రస్తుత రేవంత్ సర్కార్‌లో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని.. ఇందుకు రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న ఘట నలే నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
Gurukula Schools | రంగారెడ్డి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ప్రవీణ్‌కుమార్ బృందం హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించింది. విద్యార్థులకు అందుతున్న భోజనం, అక్కడి వసతులు, సౌకర్యాలను చూసి ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థులు తమ సమస్యలను వారికి వివరించారు. పురు గుల అన్నం తినలేకపోతున్నామని, సబ్బులు, షాంపులు ఇవ్వడంలేదని, సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అరకొరగా వస్తున్న నిధులతో కుళ్లిన కూరగాయలతో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని.. ఆ అన్నం తిని రోగాల బారిన పడుతున్నామని బోరున విలపించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కనీసం వారికి నాణ్యమైన భోజనం అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ వెలుగులోకి తీసుకొస్తుంటే..సీఎం రేవంత్ మాత్రం మంత్రులతో అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. హాస్టళ్ల సమస్యలను రాజకీయ కోణంలో చూడొద్దని.. సమస్య మూలాలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.
గురుకులాల్లో లెక్చలర్లు సరిగా ్గలేరని అనేక చోట్ల భవనాలే లేవని.. మరుగుదొడ్లు, మూత్రశాలల్లేక విద్యార్థులు సతమతమవుతున్నారన్నారు. బెడ్లు లేక, కప్పుకొనేందుకు దుప్పట్లు కూడా ఇవ్వలేదన్నారు. నేటికీ స్పోర్ట్స్ మెటీరియల్ లేక విద్యార్థులు క్రీడల్లో వెనుకబడిపోయారన్నారు. హయత్‌నగర్‌లోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, శేరిగూడలోని రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, ఇబ్రహీంపట్నం నల్లకంచలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఇందులో గెల్లు శ్రీనివాస్, ఎర్రొళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, రాజు, అరవింద్, ప్రవీణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.