Lingampally Flyover | కొండాపూర్, మార్చి 4 : త్వరలో అందుబాటులోకి రానున్న లింగంపల్లి ఫ్లైఓవర్‌కు తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం నిరంతరం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు మొక్కవోని దీక్షతో కృషి చేసారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును వెంటనే ప్రభుత్వం లింగంపల్లి ఫ్లైఓవర్‌కు పెట్టాలన్నారు. తెలంగాణ మహనీయులను భవిష్యత్తు తరానికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. లింగంపల్లి ఫ్లైఓవర్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెట్టాకే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారింస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నాడు సీఎంగా కేసీఆర్ చేసిన కృషి ఫలితంగా లింగంపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అయ్యాయని గుర్తు చేశారు. కేంద్రంను ఒప్పించి లింగంపల్లి ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేశారని రవీందర్ యాదవ్ అన్నారు. లింగంపల్లిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌కు వెంటనే ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టి తెలంగాణపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టక పోతే పోరాటం తప్పదని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.