సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ తమ బూత్‌లెవల్ ఏజెంట్లకు ఎలక్షన్ కమీషన్ పేరిట గుర్తింపు కార్డులను ఇచ్చింది. పార్టీ బీఎల్ఏల పేరిట వచ్చిన గుర్తుంపు కార్డులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీఎల్ఏల పేరిట ఎన్నికల సంఘం పేరు, లోగోను దుర్వినియోగం చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 336 ప్రకారం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తెలంగాణ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.