శంషాబాద్ రూరల్, జనవరి 19 : శంషాబాద్ మండలం మల్కారం శివాలయం వద్ద సోమవారం స్థానిక సర్పంచ్ కొత్త భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్డుకు వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నేత కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కోత్వాల్‌గూడ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం అనేక గ్రామాల్లోని రైతుల భూములు లాక్కోవడం తగదన్నారు. బాధిత రైతుల తరపున రేడియల్ రోడ్డును అడ్డుకుంటామన్నారు. నిరసనలో మాజీ ఎంపీపీలు చెక్కల ఎల్లయ్య, మురళిధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సతీశ్, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రావు, కొత్త యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.