సుల్తాన్‌బజార్, జూన్ 22 : సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల ధూంధాం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందని చెప్పారు.
ఉద్యోగులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం రాజేందర్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన సుమారు 25 మంది ఉద్యమకారులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా శాఖ కార్యదర్శి విక్రమ్‌కుమార్, కోశాధికారి బాలరాజు, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఉమర్ఖాన్, శ్రీనివాస్, నరేశ్‌కుమార్, హరిబాబు, సంయుక్త కార్యదర్శి ఖలేద్ అహ్మద్, సభ్యులు గీత, శ్రీధర్ నాయుడు, జానకి, వెంకట్‌రెడ్డి, సీహెచ్ వెంకటేశ్, ప్రభాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.