Double Bedroom Houses | బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్బస్తీలో డబుల్ బెడ్రూం ఇండన్లు నిర్మించింది బీఆర్ఎస్ సర్కారు. 2 బ్లాకుల అన్ని హంగులతో 210 ఇండ్ల నిర్మాణం పూర్తిచేసింది. 2023 మేలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా 124 మంది లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికల కోడ్ రావడంతో సుమారు 68 ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయి.
గత ప్రభుత్వంలో కమలానగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. పక్కా ప్రణాళికతో తమవారి వద్ద నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రహస్యంగా దరఖాస్తులు స్వీకరించారు. 68 మందిని లబ్ధిదారులుగా తేల్చారు. వీరిలో కొందరికీ కేటాయింపు లేఖలు ఇవ్వడంతో నాలుగు కుటుంబాలు వచ్చి కమలానగర్ ఏ బ్లాక్‌లోని 4వ అంతస్తులోకి వచ్చి తాళాలు వేసుకున్నారు. మీకు ఎవరు ఇండ్లు ఇచ్చారని ప్రశ్నించిన స్థానికులకు.. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కేటాయించిందని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. ఇండ్లను గుట్టుచప్పుడు కాకుండా కాజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కమలానగర్ బస్తీవాసులకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
మా ప్రభుత్వం హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకు 3500 డబుల్ బెడ్రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా కేటాయించాం. ఏ మాత్రం అవకతవకలు, అపోహలు లేకుండానిజమైన లబ్ధిదారులకు ఇండ్లను ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రహస్యంగా ఇండ్లను వేరేవాళ్లకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. బయటి వ్యక్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఊరుకునేది లేదు.
-ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్