శామీర్ పేట, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికలలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మలాజిగిరి ఎమ్మెల్యే, మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 7 (టంటం నర్సింహ ప్రాంతం)లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ యేళ్లు భాయ్ బాబు, వార్డు నం.7 కౌన్సిలర్ అభ్యర్థి టంటం నర్సింహ, వంగ వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తాడెం కుమార్, గౌస్‌పాషా, చిన్నాయాదవ్, గౌస్ ఇమ్రాన్, సంపత్, జమిందార్ ముత్యాలు, జంగా రాజు తదితరులు పాల్గొన్నారు.
కారుగుర్తుకు ఓటు వేయండి..
అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ ఇన్చార్జి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తురపల్లి తండా ప్రాంతంలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు వార్డు నం.1లో వెంకటేశ్, వార్డు నం.2లో లావణ్య శివకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల పింఛన్ హామీని విస్మరించిన కాంగ్రెస్
వికలాంగుల పింఛన్ పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ హామీని నిలబెట్టుకోలేదని అలియాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మలాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం అలియాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 7 బీఆర్ ఎస్ అభ్యర్థి దాసరి నర్సింహతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలోనే అన్ని వర్గాలకు, ముఖ్యంగా వికలాంగులు, పేదలు, అణగారిన వర్గాలకు సముచిత న్యాయం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన బీఆర్ఎస్ పాలనను చూసి.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.