BRS Corporaters | జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన.. కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు.
హైదరాబాద్: మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. అనంతరం సభ నుంచి బలవంతంగా మార్షల్స్‌తో బయటికి పంపించారు. దీంతో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లను అరెస్టు చేసిన పోలీసులు.. నగరంలోని వివిధ స్టేషన్లను తలరించారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించుకునే అవకాశం కల్పించకపోగా, ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా వ్యవహరించిన అధికార పార్టీ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమపై దాడి చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విధానాలను ఎండగడతామని ఈ సందర్భంగా కార్పొరేటర్లు ముద్ధం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, మందడి శ్రీనివాసరావు, విజయశాంతి, సతీష్ గౌడ్ స్పష్టం చేశారు.

పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సభ్యులున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సస్పెండ్ చేసి.. మార్షల్స్‌తో బలవంతంగా సభ నుంచి బయటకు పంపించేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా బడ్జెట్‌పై ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించి.. అన్ని పార్టీలను విస్మయానికి గురి చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అణగదొక్కే విధంగా సభ వ్యవహరించిన తీరుపై గ్రేటర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం ఉదయం 10.35 గంటలకు ప్రారంభమైంది.
10.37 నిమిషాలకు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించి నివాళులర్పించింది. అనంతరం ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8440 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల సభ్యులకు చర్చకు అవకాశం కల్పించాలి. అయితే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాత్రం చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, హైదరాబాద్ నగరానికి సరిపడా నిధులను వెంటనే మంజూరు చేయాలని ఫ్లకార్డులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో తొలుత నలుగురు కార్పొరేటర్లను జీహెచ్ఎంసీ అవతల ఉన్న వ్యాన్‌లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హాల్లో మిగతా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.

పోడియం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతిలో ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌లు లాక్కుని చించేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా నెట్టేశారు. ఇదే అదనుగా సభ జరగకుండా అడ్డుకున్నారన్న కారణంతో మేయర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం మార్షల్స్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకువెళ్లారు. కాగా, కౌన్సిల్ ప్రశ్నోత్తరాల సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు సమస్యలపై ఏకరువు పెట్టారు. అధికార పార్టీ కార్పొరేటర్లే స్వయంగా ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయంటూ సభలో మేయర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, కోచ్‌లు లేక క్రీడారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, వీధి దీపాలు లేక ప్రమాదాలు, దోపిడీలు పెరిగిపోయాయని, మురుగునీటి , నాలా సమస్యలతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా డిప్యూటీ మేయర్ మొదలుకొని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జగదీశ్వర్ గౌడ్ విమర్శించారు. కాగా, సర్వసభ్య సమావేశం సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా మార్షల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను హాల్ నుంచి బయటకు తీసుకువెళ్లే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా వారిని బయటకు లాక్కుని వచ్చి వ్యాన్‌లోకి ఎక్కించారు.ఈ సందర్భంగా కొందరు మహిళా కార్పొరేటర్లకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS corporators
- Congress
- GHMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

