KCR | మల్కాజ్గిరి, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అల్వాల్ డివిజన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అంతకుముందు మౌలాలి నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కేక్ కట్ చేశారు.
అల్వాల్, మల్కాజ్గిరిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి , సబితా కిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ , జేఏసీ అధ్యక్షుడు వెంకన్న మాజీ హుడా డైరెక్టర్ వీరేశం యాదవ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చికెన్ రాజు మురుగేశ్ , అంజయ్య , జీకే హనుమంతరావు, రాము యాదవ్, మధుసూదన్ రెడ్డి రమేష్, అనిల్ కిషోర్, సయ్యద్ మోసిన, పరమేష్, భాగ్యానంద్, వంశీ ముదిరాజ్ ఉస్మాన్, సంతోష్ నాయుడు, ఖలీల్, ఇబ్రహీం, నారాయణ , అనిల్ , నరేందర్ రెడ్డి , లడ్డు శరన్ గిరి, ముఖేష్, జనార్ధన్ ఉషశ్రీ సరిత, వసంత, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.
Marri Rajasekhar Reddy Participated in KCR Birthday Celebrations