మల్కాజిగిరి, నవంబర్ 3: పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజిగిరి, అల్వాల్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోని బస్తీలు, కాలనీలలో పాదయాత్ర చేసి అనంతరం పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సార్లు ప్రజలు సీఎం కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపించారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారని అన్నారు. ప్రజలకు సేవచేయకుండా స్వార్థంతో కాలయాపన చేసిన ఎమ్మెల్యేను ఇంటికి పంపాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపనులతోపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుపరుస్తుండడంతో వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరడం హర్షణీయమని, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు మర్రి మమతారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు, బద్దం పరశురాంరెడ్డి, నాగకుమారి, విజయకుమారి, వైశాలి, ప్రకాశ్, జీవన్, వేణు, వెంకటేశ్, రఫిక్, మోయిన్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి కృషి..
మల్కాజిగిరి/ అల్వాల్, నవంబర్ 3: ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం అల్వాల్ డివిజన్లో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, వెంటాపురం డివిజన్లో సబితాకిశోర్లు అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. నాయకులు అనిల్‌కిశోర్, మోసిన్, శేఖర్‌గౌడ్, ప్రభాకర్, నవీణ్, బాబుగౌడ్ మాధవి, సరిత తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు వణుకు పుట్టించాలి..
నేరేడ్మెట్, నవంబర్ 3 : ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రతిపక్షపార్టీలకు వణుకు పుట్టించాలని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి సతీమణి మర్రి మమతా రెడ్డి అన్నారు. శుక్రవారం వినాయకనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు విస్కృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. బద్దం పరుశురాంరెడ్డి, సురేశ్, బాలకృష్ణ, ఫరీద్, అంజన్న, అబ్బన్న, నరసింహ, కీరం, ప్రభాకర్‌రెడ్డి, ఉమేశ్ కుమార్, పేపర్ శ్రీను, అరుంధతి, అరుణ, పాషాబాయ్, రాంచందర్, ఎమ్ఆర్ శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ చారి, మల్లేశ్ చారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవలోనే మర్రి రాజశేఖర్‌రెడ్డి
నేరేడ్మెట్, నవంబర్ 3 : మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి గత ఎంపీ ఎలెక్షన్లలో ఓడినా ప్రజాసేవలోనే ఉన్నారని మర్రి రాజశేఖర్‌రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీకాలనీలోని పార్టీ కార్యాలయంలో మహిళల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలతా రెడ్డి, బద్దం పరశురాంరెడ్డి పాల్గొన్నారు.