ఖైరతాబాద్, డిసెంబర్ 17 : భారతదేశ వంటకాలతో(Indian cuisine) పాటు వివిధ దేశాల వంటకాలను తాను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్( Gareth Wyn Owen) అన్నారు. ఎర్రమంజిల్లోని రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో విద్యార్థులు ‘యూరోపియన్ గార్మెట్ గాలా విందు’ను ఏర్పాటు చేశారు.
విందులో పాల్గొన్న గ్యారెత్ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలను రుచిచూసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజెన్సీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ రెడ్డి, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నవీన్ నాగరాజ్, సభ్యులు రిజ్వాన్ అబ్దుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.