సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 24: బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని మైనింగ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆడిటోరియంలో వైద్య వృత్తిలో ఉత్తమ సేవలందించిన బ్రాహ్మణ వైద్యులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, అసోసియేషన్ అధ్యక్షుడు బి.రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ విజయసారథి, అన్నపూర్ణ చారిట్రబుల్ ట్రస్టు చైర్మన్ నరేంద్రకుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఎస్వీఐఎంఎస్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్, ఎండీ కార్డియో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్ వెంకటకుమార్తో పాటు పలువురు బ్రాహ్మ ణ వైద్యులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభు త్వ పథకాలను పేద బ్రాహ్మణులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అర్చకులకు ఆరోగ్యశ్రీలో భాగంగా ఈహెచ్ఎస్ స్కీమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని డాక్ట ర్ సుధాకర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సభ్యులు విష్ణుదాస్ శ్రీకాంత్, కన్వీనర్ బీఆర్వీ సుశీల్‌కుమార్, కార్యదర్శులు శ్రీరామయ్య, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, డాక్టర్ టీవీఆర్‌కే మూర్తి, డాక్టర్ సూర్యప్రకాశ్ రావు, డాక్టర్ నర్సరాజు, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనాథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట నగేశ్ తిప్పరాజు, కోశాధికారి డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్, డాక్టర్ ఆమన్ చంద్ర, బీఓపీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు పీవీ రామచంద్రరావు, అదనపు ప్రధాన కార్యదర్శి నీలకంఠం, సాంస్కృతిక కార్యదర్శి వాణి రమణ పాల్గొన్నారు.