ఖైరతాబాద్, అక్టోబర్ 29 : ఓ యువతిపై ప్రియుడు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమెను బంధించి, కత్తెరతో గాయపరిచి, లైంగికదాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రామకృష్ణ వివరాల ప్రకారంం …ఎర్రమంజిల్‌లో నివాసం ఉండే యువతి (27) మణికొండలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్త్తుంది. అదే సమయంలో ఆమెకు రంగారెడ్డి జిల్లా బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన అంకి భాను ప్రకాశ్‌గౌడ్, అలియాస్ భాను ప్రకాశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. కాగా, కొంత కాలంగా అతనితో దూరంగా ఉంటూ వస్తోం ది.
అంతేకాకుండా తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లిందని తెలుసుకున్న భాను ప్రకాశ్ తరచూ వేధింపులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నా డు. ఈ నెల 26న రాత్రి ఆమె ఫ్లాట్‌కు వెళ్లి గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు బాధితురాలిని ఆ గదిలో బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై కత్తెరతో దాడి చేసి చేతులకు, ఇతర అవయవాలపై గా యాలు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానని, చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాధితురాలు తన రూమ్మేట్స్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.