కీసర, జూన్ 13: కుటుంబ సమస్యలతో భార్యాభర్తలిద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం.. కేశ్వాపూర్ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (24), జమ్మిగడ్డకు చెందిన బొట్టు వైష్ణవి (22) ప్రేమించుకొని ఆరు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులు కీసర మండలం అహ్మద్‌గూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్నారు. ఆ తర్వాత వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఇబ్బందులు పడ్డారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వీరిద్దరూ మంగళవారం ఇంట్లో ఫ్యాన్లకు వేర్వేరుగా ఉరివేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 100కు డయిల్ చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన కీసర పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. వ్యక్తిగత సమస్యల వల్లే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.