Borabanda | ఎర్రగడ్డ, ఫిబ్రవరి 22 : బోరబండ మల్లన్న స్వామి జాతర శనివారం గంగ తెప్పోత్సవంతో మొదలైంది. సైట్-2లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఆదివారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణం, గొలుసు తెంపుట, బోనాలు, అన్నదానం తదితర కార్యక్రమాలు కొనసాగుతాయి. సోమవారం నాగవెళ్లితో జాతర ముగియనుంది.
తొలి రోజు పూజా, గంగ తెప్పోత్సవం కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు మానుక మహేశ్ యాదవ్, మేరిగే శివన్నాయదవ్, ఆంజనేయులు యాదవ్, బత్తిరాజు వీరేశ్ యాదవ్, మేకల శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏటా శివరాత్రి ముందు ఈ జాతరను జరపటం ఆనవాయితీగా వస్తున్నది. మల్లికార్జున స్వామి పురాతన ఆలయం స్థానంలో 2 ఏండ్ల క్రితం నూతన ఆలయాన్ని నిర్మించటం జరిగింది.