వెంగళరావునగర్, మే 30 : బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబండ, ఎర్రగడ్డకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు యూసుఫ్ గూడ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి సర్దార్ ఆత్మహత్య పై అధికారులను నిలదీశారు.
‘పోయిన ప్రాణం తీసుకొస్తారా’ అని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎవరు ఫిర్యాదు చేశారని గట్టిగా నిలదీయడంతో ఫిర్యాదు ఫైల్ ను తీసి వారికి అధికారులు చూపించారు. అందులో బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి పేరున్నట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద తెలిపారు. ఇక నుంచి ఇటువంటి చర్యలకు పాల్పడితే పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని అధికారులను ప్రజలు హెచ్చరించారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసీం, జూబ్లీహిల్స్ యూత్ ప్రెసిడెంట్ ఖాలిద్, జీటీఎస్ దేవాలయ మాజీ చైర్మన్ బోడ రాంచందర్,జనరల్ సెక్రటరీ మనోజ్ యాదవ్,నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీం తదితరులు పాల్గొన్నారు.