e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం

బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం

సైదాబాద్‌, జూలై 31 : మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌ పరిధిలోని సైదాబాద్‌ డివిజన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ రజినీకాంత్‌ రెడ్డి, సైదాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్తకాపు అరుణ పరిశీలించారు. సైదాబాద్‌ కుర్మబస్తీలోని మూడు గుళ్లను సందర్శించి స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించి జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైదాబాద్‌లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించామని తెలిపారు. అమ్మవారికి బోనాలను సమర్పించే భక్తులకు, ఘటాల, ఫలహార బండ్ల ఊరేగింపునకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్‌ దీపాలను పరిశీలించి తగు సూచనలు చేసి, పండుగ సందర్భంగా వ్యర్థాలను ఆలయ నిర్వాహకులకు ప్లాస్టిక్‌ కవర్లలోనే వేయాలని కవర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఏఈ వెంకన్న, ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌, జవాన్‌ నర్సింగ్‌రావు, ఎంటామాలజీ విభాగం సూపర్‌వైజర్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాలు సిద్ధం..

పాతబస్తీలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే మహంకాళి బోనాల ఉత్సవాలకు మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. యాకుత్‌పురా నియోజవర్గంలోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని అమ్మవారి దేవాలయం, విష్ణునగర్‌ కాలనీలోని నల్లపోచమ్మ ఆలయం, సైదాబాద్‌ కుర్మబస్తీలోని మాతామైదాన్‌లో కొలువైన శ్రీవిజయ దుర్గామాత, జీవన్‌జ్యోతి సంఘంలో కొలువైన దుర్గామాత ఆలయం, కరణ్‌బాగ్‌ కాలనీలోని మల్లికార్జునాలయం ఆవరణలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు.

భారీ బందోబస్తు ఏర్పాటు : ఏసీపీ

- Advertisement -

మహంకాళి బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు పోలీసులకు సహకరించాలని మలక్‌పేట డివిజన్‌ ఏసీపీ వెంకటరమణ అన్నారు. సైదాబాద్‌లో నిర్వహించిన మైత్రి, పీస్‌ కమిటీ, ఆలయాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్వాహకులతోపాటు భక్తులందరూ పోలీసుల సూచనలు, జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రత్యేక పోలీసులతో ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు, ఆలయాల నిర్వాహకులు, పీస్‌ కమిటీ, మైత్రి కమిటీ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బోనాల పండుగకు చెక్కులు పంపిణీ..

చాదర్‌ఘాట్‌: పండుగలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మలక్‌పేట టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఆజం అలీ అన్నారు. శనివారం పాతమలక్‌పేట డివిజన్‌ పరిధి శంకర్‌నగర్‌లోని ముత్యాలమ్మ మైసమ్మ దేవాలయం, దోభిఘల్లీలోని ఈదినాంచారమ్మ దేవాలయం, న్యూశంకర్‌నగర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం, చిన్నూమియా బాడా వాటర్‌ ట్యాంక్‌ వద్ద నల్లపోచమ్మ దేవాలయం, శంకర్‌నగర్‌లోని మైసమ్మ-పోచమ్మ దేవాలయాలకు రూ.15,000 చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌చార్జి పగిళ్ల నర్సింగ్‌, దేవాలయ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల వద్ద ఏర్పాట్లు పూర్తి..

చాదర్‌ఘాట్‌: చావునీ డివిజన్‌లోని అమ్మవారి దేవాలయాల వద్ద సుందరీకరణ, మరమ్మతు పనులన్నీ పూర్తి చేయించామని కార్పొరేటర్‌ ఎంఏ సలాం షాహీద్‌ అన్నారు. డివిజన్‌ పరిధిలోని నల్ల పోచమ్మ దేవాలయం, శాంతినగర్‌లోని మైసమ్మ దేవాలయాల వద్ద బోనాల పండుగను పురస్కరించుకొని పనులన్నీ పూర్తయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేవాలయాల కమిటీ ప్రతినిధులు కార్పొరేటర్‌ ఎం.ఏ.సలాం షాహీద్‌ను సన్మానించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana