హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో లాల్‌దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. క్యూలైన్లలో భారీగా భక్తులు తమ వంతుకోసం వేచిఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇక అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొన్నది.
#WATCH | Hyderabad, Telangana: Union Minister G Kishan Reddy and his family offered prayers at Mahakali Temple in Amberpet.
(Video source – G Kishan Reddy’s Office) pic.twitter.com/QFU2R59l68
— ANI (@ANI) July 28, 2024
పంజాగుట్టలోని దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతున్నది. దుర్గా భవాని అమ్మవారిని, దక్షిణామూర్తి స్వామివారిని కూరగాయలతో అలంకరించారు.