నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గురువారం కంప్యూటర్ విభాగానికి ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. పోలీసులు బాంబు స్కాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం అధికారులు అది ఫేక్ మెసేజ్‌గా ధ్రువీకరించారు.