హైదరాబాద్: నగరంలో మరో కారు ప్రమాదం(Car Accident) చోటుచేసుకున్నది. బంజారాహిల్స్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోను ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేశారు. ఫుల్లుగా తాగిన ఓ మహిళా ఆ కారును నడుపుతున్నట్లు తేలింది.
#WATCH | Telangana | Hit and run incident reported in Banjara Hills PS limits in Hyderabad. A GHMC employee namely Bala Chander Yadav’s two-wheeler was rammed by a speeding BMW car today in Banjara Hills police station limits. The accident happened after the driver lost control… pic.twitter.com/vbOobHGjtj
— ANI (@ANI) July 7, 2023
జీహెచ్ఎంసీ ఉద్యోగి బాలా చందర్ యాదవ్ స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా బీఎండబ్ల్యూ కారు దూసుకువచ్చింది. అయితే కారు వేగాన్ని చూసి ఆ వ్యక్తి స్కూటీని ఆపేశాడు. కానీ కారు డ్రైవర్ మాత్రం వేగంగానే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఉద్యోగికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి.
రెండు రోజుల క్రితమే బండ్లగూడ జాగీర్ వద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన వాహనం అదుపు తప్పి మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై దూసుకువెళ్లింది. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.