కాప్రా/ మల్లాపూర్, అక్టోబర్ 18 ; సమాజంలో అత్యంత వెనుకబడిన వడ్డెర కులానికి చెందిన నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. చిలుకా నగర్ డివిజన్‌కు చెందిన వీరయ్య కుమార్తె ఒర్సు నందిని, కాప్రా డివిజన్‌కు చెందిన కుంచం నర్సయ్య కుమారుడు గీతా కృష్ణ, మల్లాపూర్ డివిజన్, ఎస్వీనగర్‌కు చెందిన శీతల విజయ్ కుమార్ కుమార్తె అఖిల, అలాగే వస్పతి శ్రీనివాస్ కుమారుడు జీవన్ కుమార్ ఎంబీబీఎస్‌లో ఇటీవల సీటు పొందారు. వీరు ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే, బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్ర మాజీ మంత్రి టి.హరీశ్ రావు వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, సాయిజెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, వడ్డెర సంఘం నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, బోదాసు నరేశ్, ఒర్సు పెండయ్య పాల్గొన్నారు.